23-08-2025 12:41:13 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో వానకాలం పంటల సాగుకు అవసరమైన యూరియా కేటాయించాలని, మల్యాల కే.వీ.కే ఆవరణలోనే హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ వినతి పత్రం అందజేశారు. మంత్రి తాము చేసిన విజ్ఞప్తికి సానుకూలత వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.