23-08-2025 12:43:11 AM
నల్లగొండ టౌన్, ఆగస్టు 22: జిల్లాలో సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యాన్ని తిరిగిఅప్పగించడంలో మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారుల ఉదాసీనతను ఆసరా చేసుకొన్న కొందరు అడ్డదారిలో సొమ్ము చేసుకున్నారు. బకాయిలను రాబట్టేందుకు పలుమార్లు గడువు ఇచ్చినా.. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం.. ‘మామూలు’గా తీసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వినిపిస్తు న్నాయి.
వానాకాలం 2024 సీజన్లో ఉమ్మడి జిల్లాలోని మిల్లులకు సీఎంఆర్ 6,67, 074 టన్నుల వడ్లను అప్పగించా రు. ఇందుకు 4,50,700 టన్నుల బియ్యా న్ని సీఎంఆర్ కింద మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. అయితే 2024--25 యాసంగి సీజన్ వడ్లను సీఎంఆర్ కు అప్పగించి నెలలు గడుస్తోంది. ఇప్పుడు 2025 వానాకాలం నడుస్తోంది. సీఎంఆర్ కోసం కేంద్రం ఇచ్చిన గడువు మే 31తోనే ముగిసింది.
అయినా మిల్లర్లు పూర్తి స్థాయిలో బి య్యం అప్పగించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. మొ త్తంగా ఉమ్మడి జిల్లాలో 1,28, 277 టన్నులు డెలివరీ చేయా ల్సి ఉంది. గడువు పొడిగించాలని సివిల్ సప్లయ్ ఆఫీసర్లు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాయగా, సెప్టెంబర్ 12 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఎగుమతిలో నల్లగొండ మొదటి స్థానం..
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా రైస్ ఎగుమతి చేయడంలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్,మిర్యాలగూడ, ఎక్కువ శాతం వరి పండించడంతో పాటు రైస్ మిల్లులు కూడా అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉండడం చెప్పు దగ్గ విషయం.. అయితే రెండేళ్ల క్రితం సేకరించిన ఒడ్లను ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయి.
ఇవ్వాల్సిన సీఎంఆర్ 2,24,915 టన్నులు..
యాసంగి సీజన్లో మొత్తం 6.03 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యాన్ని మిల్లులకు ఇవ్వగా.. 4,07,300 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంది. అందుకు సంబంధించి ఇప్పటి వరకు 1,82,618 మెట్రిక్ టన్నులు మాత్రమే సీఎంఆర్ కింద ఎఫ్సీఐ తీసుకుంది. ఇంకా 2,24,915 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రోజూ 1,500 టన్నుల బియ్యం తీసుకుంటున్నారు.
ఉన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తేనే..
జిల్లాలోని గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ఎఫీసీఐ ఇతర రాష్ట్రాలకు తరలిస్తేనే మిల్లర్ల నుంచి బియ్యం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వానాకాలం పంట సాగవుతోంది. ఆ దిగుబడి రాకముందే జిల్లాలో మిల్లర్ల నుంచి సీఎంఆర్ తీసుకుంటే మిల్లుల్లో ఉన్న ధాన్యం ఖాళీ అవడంతో కొత్తగా వచ్చే ధాన్యం నిల్వ చేసేందుకు అవకాశం ఉంటుంది.