18-10-2025 12:00:00 AM
ఘట్‌కేసర్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) ః పోచారం మున్సిపల్ చౌదరిగూడ ఓయూ కాలనీ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. కాలనీ ఎన్నికలలో భారీ మెజార్టీ సాధించి కాలనీ అధ్యక్షులుగా నోముల మ హేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే ఓయూ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు, శ్రీలక్ష్మీ గణపతి దేవాలయ చైర్మన్ తీపి రెడ్డి వెంకట్ రెడ్డి సభ్యు ల, దేవాలయ కమిటీ సభ్యుల ప్రమా ణ స్వీకారోత్సవములు శుక్రవారం ఘనంగా జరిగినవి.
ఈకార్యక్రమoకు చీఫ్ అడ్వైజర్ గా మాజీ ప్రెసిడెంట్ సయ్యద్ రషీద్, ఏడుకొండలు, ఎండి యూసుఫ్, కాలనీ ఉపాధ్యక్షులుగా వెంకటేష్ నాయక్, ఎండి అబ్దుల్ హమీద్, ఎన్. సత్యనారాయణ, జనరల్ సెక్రటరీగా ఎండి అబ్దుల్ మసూద్, జాయింట్ సెక్రటరీలుగా రవీందర్ గౌడ్, సయ్యద్ సమీర్, ట్రెజరర్ గా జి. రాజ్ కుమా ర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఆర్. విద్యాసాగర్ రెడ్డి, రవి నాయక్, వీరారెడ్డి, కుమార్, దండ వెంకటరెడ్డి, సురేష్, సాయి రెడ్డి, జైపాల్ రెడ్డి, అన్వర్, అంజద్ ఖాన్‌లు ఎన్నికయ్యా రు.
అదే విధంగా దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ గా వంచ ఉపేందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీగా ఆకుల మోహన్, జాయింట్ సెక్రెటరీగా సోలిపురం మోహన్ రెడ్డి, ట్రెజరర్ గా కె. రామకృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా డి. కొండల్ రెడ్డి. ఎ.సత్యనారాయణ, జి.భూపాల్ రెడ్డి, కోట్ల నందు, తీపిరెడ్డి మోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేష్, సంతోష్ , చీఫ్ అడ్వైజర్ గా ఆనంద్ శంకర్ లను నియమించడం జరిగింది.