26-12-2025 12:00:00 AM
ములకలపల్లి, డిసెంబర్ 25,(విజయక్రాంతి):క్రిస్టమస్ వేడుకలను గురువారం ములకలపల్లి మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ములకలపల్లి, జగన్నాధపురం, చాపరాలపల్లి, పొగళ్లపల్లి, తిమ్మంపేట,పూసుగూడెం ఉమ్మడి గ్రామపంచాయతీలలో ఏసుప్రభు జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ఆరాధన, ప్రార్థనలను జరిపారు. కేకు కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు.
పాస్టర్లు ఏసుక్రీస్తు జన్మ విశిష్టతను, ఆయన చేసిన బోధనలను,పంచిన ప్రేమ,శాంతి సందేశాలను వివరించారు.క్రిస్మస్ వేడుకలలో కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు బత్తుల అంజి పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు జననం ప్రపంచంలోని మానవాళికి గొప్ప ప్రేమ శాంతి సందేశం అందించిందని క్రీస్తు మార్గంలో ప్రజా ప్రభుత్వం అన్ని కులాలకు మతాలకు వర్గాలకు ప్రజాపాలన అందిస్తుందని ఈ ప్రభుత్వానికి, ప్రజలకు యే సు ఆశీర్వాదాలు ఉండాలని ఆయనవీవీ ఆకాంక్షించారు.
పేదలకు నూతన వస్త్రాలను బహుకరించారు.కార్యక్రమంలో ఆయన వెంట ములకలపల్లి సర్పంచ్ కొర్సా చంద్రలేఖ, ఉప సర్పంచ్ పువ్వాల లలితారావు, వార్డు సభ్యులు ముదిగొండ శీను, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఈర్ల సంజీవ్ కాం గ్రెస్ నాయకులు వల్లెపు మహేష్, మాజీ వైస్ ఎంపీపీ గోలి రమణ, గోలి సందీప్ పాల్గొన్నారు