26-12-2025 12:00:00 AM
ములకలపల్లి,డిసెంబర్ 25,(విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం నుండి అన్నపురెడ్డిపల్లి వైపు గురువారం తెల్లవారుజామున సీతారామ ప్రాజెక్టుకు నాలుగు లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీనిపై స్థానికులు డయల్ 100కు, ములకలపల్లి ఎస్‌ఐకి, పాల్వంచ సిఐ కి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు.
ఈనెల 24వ తేదీన ’విజయ క్రాంతి’ దినపత్రికలో ములకలపల్లి మండలంలోని పూసుగూడెం,వీకే రామవరం, సీతారాంపురం గ్రామ పంచాయతీల పరిధిలోని సీతారామ ప్రాజెక్టు కాలువ మట్టిని, మొర్రేడు వాగు నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న విషయమై ’ పడగ విప్పిన మట్టి, ఇసుక మాఫియా ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.
స్థానికులు అందించిన సమాచారం మేరకు ములకలపల్లి ఎస్త్స్ర మధు ప్రసాద్ వెంబడించి ఇసుక లోడుతో వెళ్తున్న లారీని పూసుగూడెం దగ్గర నిలిపివేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర మధు ప్రసాద్ తెలిపారు.