calender_icon.png 26 December, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి అనూహ్య స్పందన..

26-12-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 25, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పాల్వంచ మండలం ఉన్న అనుబోస్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్, కొల్లి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బసవతారక ఇండోర్ అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి సహకారంతో.. నిర్వహించిన క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి అనూహ్యస్పందన లభించింది.

పాల్వంచ పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ఈ నిర్ధారణ శిబిరానికి మహిళలు,పురుషులు హాజరయ్యారు.. డిసెంబర్ 23,24 తేదీల్లో నిర్వహించిన ఈ శిబిరాలకు 350 మంది మహిళలు 270 మంది పురుషులు మొత్తం 620 మందికి పరీక్షలు నిర్వహించారు. సుమారు ఈ జిల్లాలో 8 మండలాల నుండి, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కునూరు మండలం నుంచి సుమారు 30 మంది ఈ నిర్ధారణ శిబిరానికి హాజరై పరీక్షలలో పాల్గొన్నారు.. వీరిలో 41 మందికి క్యాన్సర్ అనుమానిత నిర్ధారణ కేసులుగా గుర్తించి. వారిని హైదరాబాద్ బసవతారక ఇండో అమెరికా హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరిగింది..

ఈ క్యాంపులో మోమోగ్రపి, అల్ట్రా సౌండ్, డిజిటల్ ఎక్స్రే, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్ష తోపాటు తదితర పరీక్షలను నిర్వహించారు..ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్యూనిటీ ఫౌండర్ గూడూరి సత్యనారాయణ, కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కొల్లి కల్పనా చౌదరి, మందలపు జగదీష్, అనుబోస్ కాలేజ్ చైర్మన్ తలసిల భరత్ కృష్ణ బసవ తారక వైద్యులు రేణుక ప్రవళిక మన్విత సిమ్రాన్ అబ్దుల్ ఏజీఎం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు..