calender_icon.png 25 December, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్ లోకల్‌ఆటో యూనియన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

25-12-2025 12:35:14 AM

 గజ్వేల్, డిసెంబర్ 24: గజ్వేల్ లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఆటో స్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్లు బి ఎస్ రూబేను మరియు బి జేమ్స్ ప్రార్థనలు చేసిన అనంతరం బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కళ్యాణ్ కర్ న ర్సింగరావు ఆటో కార్మికులతో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ అన్ని మతాలను మాజీ సీఎం కేసీఆర్ సమాన దృ ష్టితో రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడమే కాకుండా పేద ప్రజలకు ప్రభుత్వం నుండి కానుకలను అందించారన్నారు.

మతం కన్నా మానవత్వం గొప్పదని నిరూపించిన గొప్ప వ్యక్తి కెసిఆర్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆ యేసు దీవెనలు అందరిపై ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఎండి కరీం, గౌరవ అధ్యక్షులు ఎస్కే ఫరీద్, ఉపాధ్యక్షులు పి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎండి సూరజ్, కార్యదర్శి కే సందీప్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.