25-12-2025 12:33:27 AM
నంగునూరు, డిసెంబర్ 24: వ్యవసాయ సాగు పనులు ఊపందుకుంటున్న వేళ రైతులకు యూరియా కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. బుధవారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు భారీగా క్యూ కట్టారు.యూరియా పంపిణీని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం కొత్తగా యాప్ విధానాన్ని తీసుకువచ్చినప్పటికీ, అది క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి.స్మార్ట్ ఫోన్లు లేని వారు, యాప్ వాడకం తెలియని వృద్ధ రైతులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.