25-12-2025 12:35:54 AM
కేసు ఛేదించిన వనపర్తి పోలీసులు
వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడి
వనపర్తి టౌన్, డిసెంబర్ 24 : పక్క ప్రణాళికతో పకడ్బందీగా ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు. బుధవారం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వనపర్తి జిల్లా పరిధిలోని అమరచింత మండలం నాగల కడుమూరు గ్రామానికి చెందిన గట్టు వెంకటేష్, బండమీది రాజేష్, కురువ రాములు,
డ్యాం వెంకటేష్, వెంకటేష్ బండమీది రాజేష్ అనే వ్యక్తులు ఒక ముఠా గ్యాంగ్ గా ఏర్పడి ఈనెల 17న వనపర్తి జిల్లా కేంద్రంలో సంచరిస్తూ జిల్లా సమీపంలోని లక్ష్మీ నరసింహ కాలనీలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో ఉన్న విలువైన బంగారు చైన్ ను బండమీది రాజేష్, కురువ రాములు అనే ఇద్దరు నిందితులు బైక్బపై వచ్చి మెడలో బంగారు గొలుసు అపహరించుకొని పారిపోయారని బాధితులు ఈ విషయంపై వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని డిఎస్పి తెలిపారు.
మంగళవారం వనపర్తి జిల్లా పరిధిలోని నాగవరం గ్రామం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా నేరస్తులు బైక్ పై వచ్చారని ఆపడానికి పోలీసులు ప్రయత్నిస్తే పారిపోయే ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే పట్టుకొని విచారించగా చైన్ స్నాచింగ్ దొంగతనం కేసులో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల పేర్లు తెలిపినట్లు డిఎస్పి వివరించారు. దాదాపు 40 లక్షల రూపాయల విలువ గల 10 గ్రాముల బంగారం, రెండు పల్సర్ ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో తో పాటు రెండు విలువైన కార్ల ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్టు చేయడంలో వనపర్తి రూరల్ ఎస్త్స్ర జలంధర్ రెడ్డి తో పాటు ఎస్త్స్ర ట్రైనింగ్ ఎస్త్స్ర వేణుగోపాల్, వనపర్తి రూరల్ పోలీస్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ గౌడ్, రాంగోపాల్ వర్మ, ఆంజనేయులు, రఫిక్, ప్రవీణ్ లను జిల్లా జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అభిమానిస్తూ రివార్డును అందజేసారు.