08-07-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూలై 7: బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఈ ప్రక్షాళన ప్రక్రియ సమయం, దాని అమలు తీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
తాను ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకం కాదని, కానీ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు జాబితాను సవరించాలనుకోవడం సముచితం కాదన్నారు. ప్రజలకు కొంత సమయం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.అసదుద్దీన్ మాట్లాడుతూ.. సవరించే ఓటరు జాబితాలో 15 నుంచి 20 శాతం మంది పేర్లు గల్లంతైనా వాళ్లు కేవలం ఓటు హక్కును మాత్రమే కోల్పోరని.. తమ పౌరసత్వాన్ని కూడా కోల్పోతారని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది ప్రజల జీవనానికి సంబంధించిన సమస్య అని అన్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో ఓటర్ జాబితాను సవరించడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. కొందరు వ్యక్తు లు నిజంగా అక్రమ వలసదారులయితే వా రికి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎందుకు అనుమతించారని ప్రశ్నిం చారు. ఈ ప్రక్రియ వెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల హస్తం ఉందన్నారు.