calender_icon.png 9 July, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గాభవానీ అమ్మవారికి గుండు దోసకాయల మాలల అలంకరణ

08-07-2025 07:29:22 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయం(Sri Durga Bhavani Temple)లో జరుగుతున్న ఆషాడమాసం శాకంబరీ ఉత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీదుర్గాభవానీ అమ్మవారిని గుండు దోసకాయల మాలలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ పూజరులు విశేష హారతులు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్‌ చైర్మెన్‌ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు.