08-07-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూలై 7: త్రిభాష విధానం అమలుపై వివాదం కొనసాగుతున్న వేళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల్ భార తీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. దేశంలోని భారతీయ భాషలన్నీ జాతీయ భాషల కిందే లెక్క అని ఆయన నొక్కి చెప్పారు.
ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరైన సునీల్ అంబేద్కర్ మాట్లా డుతూ.. ‘దేశంలోని అన్ని భాషలు జాతీయ భాషలే అన్న వైఖరిని సంఘ్ ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది. ఆయా రాష్ట్రాల ప్రజలు వారి సొంత భాషనే మాట్లాడటం చూ స్తుంటాం. అందరూ కోరుకుంటున్నట్టుగా ప్రాథమిక విద్య కూడా వారి మాతృభాషలోనే ఉండాలి. ప్రాంతీయ భాష అనేది ఇప్ప టికే స్థిరపడిపోయింది. దానిని మార్చడానికి ఎవరికి హక్కు లేదు.’ అని పేర్కొన్నా