26-06-2025 01:17:54 AM
బీఎంఎస్ పై 13 ఓట్ల తేడాతో విజయం
పటాన్ చెరు, జూన్ 25 : ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని టీఐడీసీ పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక ఎన్నికల్లో సీఐటీయూ గెలుపొందింది. బీఎంఎస్ పై 13 ఓట్ల తేడాతో సీఐటీయూ గెలుపొందింది. మొత్తం 161 ఓట్లకు గాను సీఐటీయూ కి 87 ఓట్లు, బీఎంఎస్ కు 74 ఓట్లు వచ్చాయి. ఈ గెలుపుతో వరుసగా సీఐటీయూ ఐదు సార్లు గెలుపొందినట్లు కార్మికులు తెలిపారు.
బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎస్ మల్లేశంపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు విజయం సాధించారు. ఈ సందర్భంగా పరిశ్రమ ఎదుట విజయోత్సవ ర్యాలీ నిర్వహించి కార్మికులు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం చుక్క రాములు మాట్లాడుతూ టీఐడీసీ పరిశ్రమలో ఐదవ సారి విజయాన్ని అందిచిన కార్మికులకు అభినందనలు తెలిపారు.
కార్మికుల భవిష్యత్తుకు సీఐటీయూ ఎల్లప్పడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, జిల్లా కోశాధికారి కే రాజయ్య, యూనియన్ నాయకులు భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, జగన్ రెడ్డి, ప్రభాకర్, సత్తయ్య, సుధాకర్ గౌడ్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.