29-08-2025 11:51:53 PM
సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట పట్టణంలోని సాయి సంతోషి జ్యూయలరీ షాప్ లో జూలై 21న జరిగిన బంగారం దొంగతనం కేసులో మరో నింధితుడినీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్లడించారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో నలుగురు నిందితులను అరెస్టు చేయగా సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ ల ఆద్వర్యంలో పోలీసు ప్రత్యేక బృందం వెస్ట్ బెంగాల్ కు వెళ్ళి సాంకేతిక ఆధారాలు, నమ్మదగిన సమాచారంతో మరో నింధుతుడైన వెస్ట్ బెంగాల్, మల్దా జిల్లా కు చెందిన ఏ5 జషిముద్దీన్ ను మాల్డా జిల్లా, రత్వా పోలీస్ స్టేషన్ పరిధి, ఒకేరా చాంద్-పరా మండలం అందారు గ్రామం నంధు ఆధుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారన్నారు.
అతని నుండి రూ. 25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.4,84,500 నగదు స్వాదినం చేసుకున్నామన్నారు. వెస్ట్ బెంగాల్ చాచల్ కోర్టులో న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టి 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి తీసుకుని నిందితుల రాష్ట్రాల బదిలీ (ట్రాన్సిట్) నిభందనల ప్రకారం సూర్యాపేటకు తీసుకుని వచ్చినట్లు తెలిపారు. జషిముద్దీన్ ఒప్పుకోలు ప్రకారం వివరాలు నమోదు చేసి ఈరోజు కోర్టు నందు హాజరుపరిచి, రిమాండ్ కు తరలించామన్నారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు.
ఈ కేసులో బాగా పని చేసిన సూర్యపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సిసిఎస్ ఇన్ప్సెక్టర్ శివ కుమార్, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సిసిఎస్ హరికృష్ణ, పెనపహాడ్ ఎస్సై గోపికృష్ణ, పట్టణ ఎస్సైశివ తేజ, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ కర్ణాకర్, శ్రీరాములు, కృష్ణ, శ్రీనివాస్, పాలకీడు సైదులు, ఆనంద్, మల్లేష్, సతీష్, శివ కృష్ణ, టెక్నికల్ టీం సుధాకర్, సుమర్, సైబర్ సెక్యూరిటీ టీం సైదులు, మహేష్, పట్టణ పోలీసు సిబ్బందీని రివార్డ్ తో అభినందించారు.