30-08-2025 12:10:05 AM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం విద్యుత్ శాఖ, సర్కిల్ ఆఫీస్ నందు వ్యవసాయ భూములలో సౌర విద్యుత్ ప్లాంట్ స్థాపన దరఖాస్తు దారులతో ఆ శాఖ ఎస్ఐ ఇనుగుర్తి శ్రీనివాసాచారి శుక్రవారం సమావేశం అయ్యారు. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, PM-KUSUM component -A లో సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్న రైతులు, రైతు సమూహలు, డెవలపర్స్ యొక్క సందేహాలు తీర్చుటకు ఉదేశించబడింది. రైతులు తమ పొలాల నుండి ఉత్పత్తి అయిన విద్యుత్తు సరఫరా చేయుటకు దగ్గరలోని విద్యుత్ సబ్ స్టేషన్ వరకు 11 కె.వి లైన్. వేయుటకు అంచనా వివరాలను తెలియజేశారు.
ఈ సమావేశంలో LDM/ఖమ్మం, DM /TGREDCO SBI/Agri లోన్ మేనేజర్, పంజాబ్ నేషనల్ బ్యాంకు/గాంధీచౌక్ మేనేజర్, ఖమ్మం జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న దరఖాస్తు దారులు 35 మంది హాజరయ్యారు. ఇట్టి సౌర విద్యుత్తు కేంద్రాలు 2025 డిసెంబర్ నెల ఆఖరి కల్లా స్థాపించాలని తెలియజేశారు. ఇవి అందుబాటులోకి వస్తే స్వచ్ఛమైన సౌర విద్యుత్తు 53 MW రైతుల పొలాల నుంచి జిల్లా విద్యుత్ శాఖకు అందనుంది.ఈ సమావేశంలో బ్యాంకు లోన్ల కొరకు, ఇతర సందేహాలకు నివృత్తి చేసి తగు సూచనలు, సలహాలు అందించారు.