calender_icon.png 30 August, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెచ్చిపోయిన సైబర్ కేటుగాళ్లు

30-08-2025 12:01:16 AM

ముద్ర లోన్ పేరుతో లక్షన్నర కాజేసిన సైబర్ నేరుగాలు

హుజురాబాద్,(విజయక్రాంతి): ముద్ర లోన్ పేరుతో అకౌంట్లోని లక్షన్నర రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలం అంకుశాపూర్ లో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకుషాపూర్ గ్రామానికి చెందిన కడిపికొండ శివారెడ్డికి ముద్ర లోన్ శాంక్షన్ అయిందని గుర్తుతెలియని వ్యక్తి నుండి వాట్సప్ లో లింక్ వచ్చింది.

దీంతో ఆశగా బాధితుడు ఓపెన్ చేయగా నిందితులు లోన్ పొందాలంటే రూ. 1,50,000 ఇవ్వాలని కోరగా బాధితుడు అడిగిన డబ్బులు ఇచ్చాడు. తిరిగి వారిని సంప్రదించగా ఎలాంటి స్పందన లేకపోవడంతో శివారెడ్డి మోసపోయానని గుర్తించి జమ్మికుంట పోలీసులకు రాత్రి అందాద తొమ్మిది గంటల ప్రాంతంలోఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు.