calender_icon.png 30 August, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

30-08-2025 01:05:44 AM

సంస్థాన్ నారాయణపూర్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. నేషనల్ స్పోరట్స్ డే ఆకృతిలో విద్యార్థులు అద్భుత ప్రదర్శన నిర్వహించారు.

మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ దీపా జోషి మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహద పడతాయని చదువుతోపాటు క్రీడల్లో మంచి నైపుణ్యం సాధించాలని అన్నారు. భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ధ్యాన్ చంద్ జీవితం రేపటి భావితరాలకు ఆదర్శనీయమని అన్నారు. శాంతియుత సమాజాన్ని నెలకొల్పడానికి యువత  క్రీడల వైపు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని  అన్నారు.ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు నాగరాజు,నీలిమ,కృష్ణా,ఉష విద్యార్థులు పాల్గొన్నారు.