30-08-2025 12:05:58 AM
పతకాలు సాధించిన అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్
ఖమ్మం,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను ఉత్తమ సేవ పతకం పొందిన వారిలో ఎం. అబ్దుల్ రహీమాన్ (ACP wyra) పి.సత్యనారాయణ (ఎస్సై IT Core) వున్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మరో నలుగురు పోలీసు అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలు దక్కాయి. సేవాపతకం పొందిన వారిలో బి.వెంకటరమణారావు (ఏఎస్సై), జె.వెంకటేశ్వర్లు (ఏఎస్సై), ఎన్.వెంకట రెడ్డి (ఏఎస్సై), మహోన్నత సేవ పతకం సాధించిన Sk.సయ్యద్ హుస్సేన్ (హెడ్ కానిస్టేబుల్)వున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా అందజేసి అభినందించారు.