calender_icon.png 30 August, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు

30-08-2025 12:37:44 AM

  1. రూ.51 కోట్లతో నిమజ్జన ఏర్పాట్లు 
  2. ప్రధాన చెరువులతో పాటు74 కృత్రిమ కుంటలు సిద్ధం 
  3. జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ 

హైదరాబాద్ సిటిబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి):  గణేశ్ నిమజ్జనాన్ని అవాంత రాలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసేందుకు జీహెచ్‌ఎంసీ సర్వం సిద్ధం చేసింది. రూ.51 కోట్ల భారీ బడ్జెట్‌తో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, పారిశు ద్ధ్యం, భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.

నగ రంలోని ప్రధాన నిమజ్జన కేంద్రాలైన హుస్సేన్ సాగర్, సరూర్ నగర్, ఐడీఎల్ చెరువులతో పాటు మొత్తం 20 ప్రధాన చెరువుల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు.  అలాగే నగరవ్యాప్తంగా 74 కృత్రిమ నిమజ్జన కుంటలను ఏర్పాటు చేశారు. వీటిలో 27 శాశ్వత బేబీ పాండ్స్, 24 తాత్కాలిక కొలనులు, 23 తవ్వకం కుంటలు ఉన్నాయి. విగ్రహాల నిమజ్జనాన్ని వేగవంతం చేసేందుకు మొత్తం 403 క్రేన్లను అందుబాటులో ఉంచారు.

వీటిలో 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లు నిరంతరం పనిచేయనున్నా యి. నిమజ్జనం అనంతరం నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు జీహెఎంసీ పారిశుద్ధ్య విభాగం భారీ ప్రణాళికతో సిద్ధమైంది. మొత్తం 14,486 మంది శానిటేషన్ సిబ్బం ది మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు. వీరి ని పర్యవేక్షించేందుకు 160 ప్రత్యేక గణేశ్ యాక్షన్ బృందాలను ఏర్పాటు చేశారు. 303 కిలోమీటర్ల శోభాయాత్ర మార్గంలో ప్రతి 3-4 కిలోమీటర్లకు ఒక పారిశుద్ధ్య బృం దం చెత్తను తొలగిస్తుంది.

పూజా వ్యర్థాల సేకరణ కోసం 5 లక్షల చెత్త సంచులను పం పిణీ చేశారు. వీటితో పాటు 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లు, 30 స్వీపింగ్ యంత్రాలు రంగంలోకి దిగనున్నాయి. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అత్యంత కీలకమైన హుస్సేన్ సాగర్ వద్ద 16 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డీఆర్‌ఎఫ్ బృందాలు, 200 మంది నిపుణులైన గజ ఈతగాళ్లు, 9 పడవలను నిరంతరం గస్తీ కోసం ఉంచారు.

శోభాయాత్ర మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు ప్రమాదకరం గా ఉన్న చెట్ల కొమ్మలను, విద్యుత్ వైర్లను సరిచేశారు. నగరవ్యాప్తంగా 10,269 రోడ్డు గుంతలను పూడ్చివేసి, మరమ్మతులు పూర్తిచేశారు. భక్తులకు సౌక ర్యా లు నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల కోసం జీహెఎంసీ అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. 

నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు పోలీసులతో కలిసి 13 ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి సమన్వయం చేయనున్నారు. నిమజ్జనం జరిగే చెరువుల్లో దోమల బెడద లేకుం డా యాంటీ లార్వా, పాగింగ్ చర్యలను ము మ్మరం చేసినట్లు కమిషనర్ వివరించారు.