30-08-2025 12:04:51 AM
- జాడలేని మిషన్ భగీరథ నీరు
- నేటికీ ఆ గ్రామానికి బావి నీరే దిక్కు
- సీజనల్ వ్యాధులపై అప్రమత్తత మరిచిన అధికారులు
మెట్ పల్లి, ఆగస్టు 29:(విజయ క్రాంతి)ఆ గ్రామం మెట్ పల్లి పట్టణానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ప్రస్తుతం పదకొండవ వార్డ్ పరిధిలో ఉన్న వెంకట్రావ్ పేట గ్రా మం పంచాయతీగా ఉన్నప్పుడు ఆ గ్రామ స మస్యలు స్థానిక పంచాయతీ పాలక వర్గం పరిష్కారం చేసుకునే వారు.కాని ఏడు సంవత్సరాల క్రితం వెంకట్రావ్ పేట ను మెట్ పల్లి మున్సిపల్ లో విలీనం చేయడం జరిగింది. దింతో వారి సమస్యల పరిష్కారం కోసం మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగిన పట్టించుకునే నాధుడు కరువాయ్యాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరు ఆ గ్రామానికి కరు వైంది. జాతీయ రహదారిని అనుకోని ఉన్న వెంకట్రావ్ పేట మీదుగానే మిషన్ భగీరథ పైప్ లైన్ జగిత్యాల జిల్లాలోని సుదూర మం డలాలు అయిన సారంగాపూర్, ధర్మపురి లకు సరఫరా జరుగుతుందికాని తమకు భగీరథ నీరు అందక పోవడం వారిని తీవ్ర ఆవే దనకు గురి చేస్తోంది.గ్రామ శివారులో సు మారు పదిహేను సంవత్సరాల క్రితం నలభై వెల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగగా, మళ్లీ ఆరు సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ నిధులతో పాత ట్యాంక్ పక్కనే నలభై వెల లీటర్ల సామర్ధ్యం కలిగిన మరో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు.
ట్యాంక్ ల నిర్మాణం సమ యంలో అధికారులు సరియైన స్థలం గుర్తించకుండా గ్రామ శివారులో మురుగు నీరు నిలిచే గుంతలు ఉన్న ప్రాంతంలో రెం డు ట్యాంక్ లు నిర్మాణం చేయడంతో అవి పనికి రాకుండా పోయాయి.రెండు ట్యాంక్ ల వాల్స్ మురికి నీటిలో మునిగిపోవడంతో ట్యాంక్ లకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడం లేదు. దింతో స్థానికంగా ఉన్న బో రు నీటిని బావికి సరఫరా చేసి వాటిని న ల్లాల ద్వారా గ్రామస్తులకు ప్రతి రోజు సరఫరా చేస్తున్నారు. దింతో గ్రామస్తులు రోగా ల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇక గ్రామ పరిధిలో ఉన్న అంత ర్గత రహదారులు సిసి కి నోచుకోక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. మురుగు కాలువల నిర్మాణం లేక మురుగు నీరు ఎక్కడిక్కడ నిలిచిపోయి తీవ్ర దుర్గంధం నెలకొంటోంది. గ్రామ పంచాయతీ గా ఉన్నపుడు జరిగిన అభివృద్ధి మాత్రమే విలీనం అనంతరం గ్రామం అభివృ ద్ధికి నోచుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు గ్రామం లో ఐదుగురు పారిశుధ్య కార్మికులు పని చేసి ఏరోజుకారోజు చెత్తను తొలగించేవారు. కాని విలీనం అనంతరం గ్రామనికి కేవలం ఇద్దరు పారిశుధ్య కార్మికులను కేటాయించడంతో పారిశుధ్య పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
మిషన్ భగీరథ నీటిని అందించాలి
మా గ్రామం మీదుగా మిషన్ భగీరథ ప్రధాన పైపు లైన్ వేయడం జరిగింది. సూదురా మండలాలకు మా ఊరి మీదుగా నీటిని తరలిస్తున్న అధికారులు తమకు మాత్రం మిషన్ భగీరథ నీటిని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటిని అందించడానికి చర్యలు చేపట్టాలి.
కోమిరెడ్డి శ్రీనివాస్ వెంకట్రావ్ పేట గ్రామస్తుడు
త్వరలోనే - మిషన్ భగీరథ నీటి సరఫరా
గతంలో సరి అయిన ప్రణాళిక లేకుండా ప్రధాన వాటర్ ట్యాంక్ లు నిర్మాణం చేపట్టారు. వాటి వాల్స్ నీటిలో మునిగిపోయి ఉన్నాయి.దింతో నీటి సరఫరా చేపట్టాలెకపోతున్నాము.ప్రస్తుతం పట్టణంలోని మిషన్ భగీరథ ప్రధాన ట్యాంక్ నుండి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా కు చర్యలు చేపట్టం.త్వరలోనే ఆ గ్రామానికి మిషన్ భగీరథనీరుఅందుతుంది.
నాగేశ్వర్ రావుమెట్ పల్లి మున్సిపల్ డి.ఈ.