calender_icon.png 30 August, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమ స్థలంలో పడుకున్నందుకే హత్య

30-08-2025 01:03:47 AM

వీడిన రమేష్ హత్య కేసు  

24 గంటలు గడవక ముందే చేదించిన వన్ టౌన్ సీఐ 

నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి 

నల్లగొండ టౌన్,  ఆగస్టు 29: నల్లగొండలో గురువారం  సంచలనం సృష్టించిన మర్డర్ కేస్ లో 24 గంటలు గడవకముందే వన్ టౌన్ పోలీసులు  కేసును చేదించారని  నల్గొండ డి.ఎస్.పి  కే శివరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో వివరాలు వెల్లడించారు.  కర్ణాటక రాష్ట్రానికి చెందిన షేక్ సిరాజ్  లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో  సిరాజ్ లారీ డ్రైవర్ తో గొడవ పడగా  ఆ లారీ డ్రైవర్ నల్లగొండలో దింపి వెళ్లిపోయాడు.

ఈయన గత నెల నుంచి ఎటు వెళ్లకుండా నల్గొండలో ఉంటూ భాస్కర్ టాకీస్ సమీపంలో ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ లో ఐదురూపాల భోజనం తింటూ అదే ప్లేస్ లో పడుకొని కాలం వెళ్లదీస్తున్నాడు. నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేష్ (35) నల్గొండ పట్టణంలో ఉంటూ డ్రైవర్ కొనసాగి స్తున్నాడు. ఈ సమయంలో తన భార్య తన తల్లి గారి ఇంటికి వెళ్లడంతో రమేష్ కూడా అన్నపూర్ణ క్యాంటీన్ లో భోజనం చేస్తూ అక్కడే నిద్రిస్తూ కాలం గడుపుతున్నాడు. బుధవారం రాత్రి అన్నపూర్ణ క్యాంటీన్ లో సిరాజ్  నిద్రిస్తున్న స్థలంలో చింతకింది రమేష్(మృతుడు) పడుకు న్నాడు.

దీంతో సిరాజ్  పడుకుండడం చూసి కోపద్రిక్తులైన గొడవకు దిగి చేత్తో కొట్టి గొంతు పట్టుకొని చంపుతానని రమేష్ ను బెదిరించి వెళ్లిపోయాడు. తిరిగి సిరాజ్ గంట తర్వాత నిద్రి స్తున్న రమేష్ పై బండరాళ్లతో మృతుడి తలపై బలంగా కొట్టి రాయిని దొరకకుండా కాలేజీ గోడ వెనకాలకు విసిరేశాడు. మృతుడి బావ  భాష పాక  వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  సీసీ ఫొటోజీ ఆధారంగా చాకచక్యంగా వ్యవహరించి నిందితుడు సిరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలగొండ డిఎస్పి శివరాం రెడ్డి నేతృత్వంలో సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆధ్వర్యంలో ఎస్త్స్ర వెంకట్ నారాయణ, ఏఎస్‌ఐ వెంకట్ యాదవ్, సిబ్బంది రబ్బాని, షకీల్, శ్రీకాంత్, శంకర్, జానకి రాములు, సైదులు లను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో ఎస్త్స్రలు  జూకూరి  సైదులు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.