calender_icon.png 25 May, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేనూ బెత్తం దెబ్బలు తిన్న

06-05-2024 12:57:21 AM

పాఠశాల రోజులను గుర్తుచేసుకొన్న సీజేఐ చంద్రచూడ్

కాట్మాండు, మే 5: పాఠశాలలో చదువుతున్న రోజుల్లో తాను కూడా టీచర్‌తో బెత్తం దెబ్బలు తిన్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. నేపాల్‌లో జరుగుతున్న బాలనేరస్తుల న్యాయవ్యవస్థ సదస్సులో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఐదో తరగతి చదువున్నప్పుడు అనుకుంటా.. ఒకరోజు మా టీచర్ అసైన్‌మెంట్ ఇచ్చారు. అందుకోసం నేను సరైన సైజులో సూదులను తీసుకురాలేదు. దీంతో ఆగ్రహించిన టీచర్ నా చేతిపై బెత్తంతో బలంగా కొట్టారు.  నా చెయ్యి వాచిపోయింది. అవమానంతో పది రోజులవరకు చెయ్యిని ఎవరికీ చూపించలేదు’ అని తెలిపారు.