calender_icon.png 22 January, 2026 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసాపై స్పష్టత ఇవ్వాలి

22-01-2026 12:20:28 AM

రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మారెడ్డి రామలింగారెడ్డి

సిద్దిపేట క్రైం, జనవరి 21 : ప్రతి రైతుకు ఎకరాకు సంవత్సరానికి రూ.15వేల చొప్పున రైతు భరోసా అందిస్తామని ఎన్నికల సమయం లో హామీ ఇచ్చిన కాం గ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మారెడ్డి రామలింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్ర రైతుల్లో అయోమయం నెలకొన్నదన్నారు.

బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా పథకాన్ని క్రమబద్ధంగా, పారదర్శకంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకం విషయంలో స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం వల్ల రైతుల విశ్వాసం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.

ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమావేశంలో రైతు రక్షణ సమితి నాయకులు పన్యాల విష్ణువర్ధన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, దేవేందర్ రెడ్డి, మొతుకు లక్ష్మయ్య, యాదంరావు, సంతోష్ రెడ్డి, భూపతి రెడ్డి పాల్గొన్నారు.