calender_icon.png 22 January, 2026 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్దాపూర్‌లో వీధి కుక్కల స్వైరవిహారం

22-01-2026 12:19:35 AM

మొయినాబాద్, జనవరి 21( విజయక్రాంతి): మండల పరిధిలోని అమ్దాపూర్ గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. కుక్కల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా చికెన్ సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను రోడ్లపైనే పడేస్తుండటంతో, అక్కడ కుక్కలు గుంపులుగా చేరుతూ బాటసారులపై దాడులకు తెగబడుతున్నాయి.

చికెన్ సెంటర్ల వ్యర్థాల వల్ల కుక్కల బెడద పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యక్తి గత పనినిమిత్తం  పిల్లలు, వృద్ధులు మహిళలు రోడ్లపై నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, వ్యర్థాలు పడేసే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.