calender_icon.png 22 January, 2026 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్బరీ సాగుతో సిరుల పంట

22-01-2026 12:21:24 AM

తెలంగాణలోనే మొట్టమొదటి సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తలకొండపల్లి, జనవరి 21:( విజయక్రాంతి) సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి, రైతులు మల్బరీ (పట్టు) సాగు వైపు మళ్లడం ద్వారా అధిక లాభాలు గడించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తలకొండపల్లి మండలంలోని కోరింతకుంట తండాలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ను డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ శ్రీమతి షేక్ యస్మాన్ భాష, ఐ.ఏ.ఎస్ గారితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ మల్బరీ పంట కేవలం 21 రోజుల్లోనే చేతికి వస్తుందని, ఇంత తక్కువ సమయంలో ఆదాయం ఇచ్చే పంట మరొకటి లేదని వారు పేర్కొన్నారు.గ్రామీణ యువత పట్టణాలకు వలస వెళ్లకుండా, తమ సొంత గ్రామాల్లోనే మల్బరీ, ఉద్యాన పంటలు సాగు చేస్తూ కొత్త ఒరవడి సృష్టించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్బరీ సాగుకు భారీగా రాయితీలు కల్పిస్తున్నాయని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పండించిన పంటను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందున మార్కెటింగ్ ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. రైతులు ’ఫార్మర్ అసోసియేషన్’ (రైతు ఉత్పత్తిదారుల సంఘం)గా ఏర్పడితే ప్రభుత్వ రాయితీలు మరింత ఎక్కువగా అందుతాయని సూచించారు.

దేశానికే ఆదర్శం.......

కోరింతకుంట తండాలో పట్టు సాగును భారీగా చేపట్టి, దేశంలోనే ఈ గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేష్, సైంటిస్టులు వినోద్, మంజప్పా, రిసోర్స్ సెంటర్ నిర్వాహకుడు శక్రు నాయక్ పాల్గొన్నారు. అలాగే సర్పంచ్ సరోజ రవీందర్, పిఎసిఎస్ అధ్యక్షులు గట్ల కేశవరెడ్డి, పీసీసీ మెంబర్ శ్రీనివాస్ గౌడ్, ఆమంగల్ బ్లాక్ కమిటీ అధ్యక్షులు యాట నరసింహ, సెరికల్చర్ అధికారులు అరుణ, నాగరత్న, ముత్యాలు, లతా మరియు ఉద్యానవన అధికారులు హిమబిందు, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.