calender_icon.png 26 November, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివ్వంపేట కాంగ్రెస్‌లో వర్గపోరు

26-11-2025 12:01:28 AM

-పీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఇరు వర్గాల లొల్లి

-పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో పోలీసుల రంగ ప్రవేశం

-భగలాముఖి అమ్మవారికి టీపీసీసీ చీఫ్ ప్రత్యేక పూజలు

సంగారెడ్డి/శివ్వంపేట, నవంబర్ 25(విజయక్రాంతి): మెదక్ జిల్లా నర్సాపూర్ నియో జకవర్గం శివ్వంపేట మండలంలోని శ్రీభగలాముఖి అమ్మవారి శక్తిపీఠం యాగశాల ప్రారంభోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మహేశ్‌గౌడ్‌ను గజమాలతో సత్కరించాలని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి వర్గీయులు, ప్రస్తు త డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ వర్గీయులు పోటీ పడ్డారు.

దీంతో నాయకులు నిర్వహిం చిన ర్యాలీ వర్గపోరుకు వేదికైంది. మండల కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలతో ర్యాలీలో ఇరు వర్గాల మధ్య తోపులాటలు చోటుచేసుకోవడంతో వాతావరణం క్షణాల్లో ఆందోళనకరంగా మారిం ది. కొందరు కార్యకర్తలు పరస్పరం దాడులకు కూడా పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టారు.

ప్రత్యేక పూజలో టీపీసీసీ చీఫ్

శివ్వంపేటలోని శ్రీభగలాముఖి అమ్మవారి శక్తిపీఠంలో యాగశాల మండపం ప్రారంభోత్సవ పూజలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజ లు చేశారు. అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వేంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఆయన్ని  సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, మై నంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మె ల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్తా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడకంచి సుదర్శన్‌గౌడ్, మాజీ ఎంపీపీ హరి కృష్ణ, బీఆర్‌ఎస్ నాయకులు రమణాగౌడ్, చంద్రాగౌడ్, మన్సూర్, కాంగ్రెస్ నాయకులు కొడకంచి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా పబ్బ అంజయ్య, రామ వ్వ జ్ఞాపకార్థం పబ్బ రమేశ్‌గుప్త కుటుంబీకులు అన్నదానం నిర్వహించారు.