calender_icon.png 6 July, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే వర్గీకరణ

05-07-2025 07:19:55 PM

జిల్లా ఇంచార్జ్ గుండా థామస్ 

 కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని ఆ సంఘం జిల్లా ఇన్చార్జి గుండా థామస్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్ లో ఆ సంఘం సీనియర్ నాయకుడు మాటూరి జయరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండా పండుగకు జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు తో కలిసి హాజరయ్యారు. సంఘం జెండా గద్య నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం థామస్ మాట్లాడుతూ... జాతిని శక్తివంతంగా తయారు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. వర్గీకరణ పోరాటంలో ప్రాణ త్యాగాలు,జైలు శిక్షలు,లాంటిదెబ్బలకు గురైన సంఘటనను గుర్తు చేశారు.ప్రతి మాదిగ పల్లెలో ఈనెల 7న జెండా పండుగ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఎమ్మార్పీఎస్ మరింత బలోపేతం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు.

కమిటీ నియామకం...

ఎమ్మార్పీఎస్ వార్డ్ కమిటీ అధ్యక్షుడిగా మోతే జాన్,ఉపాధ్యక్షులుగా మాటూరి కుమార్, నితిన్ ప్రధాన కార్యదర్శులుగా నీరజ్, నిఖిత్, చంద్ర శివ, ప్రచార కార్యదర్శిగా సత్యనారాయణ, కోశాధికారిగా కిరణ్, కార్యవర్గ సభ్యులుగా దుర్గాప్రసాద్, సురేష్ ,బాలేష్ ను సీనియర్ నాయకుడు వేముర్ల పోశం సమక్షంలో నియమించారు.ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, కళావతి తదితరులు పాల్గొన్నారు.