05-07-2025 07:17:07 PM
సమ్మె పిలుపు కార్మికులకు... సామాన్య ప్రజలకు
నడిరోడ్డుపై సిపిఐ ఉపన్యాసాలు
ఇబ్బంది పడ్డ ప్రయాణికులు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులను భాగస్వామ్యం చేయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా శనివారం పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్ ఏరియాలో ఏకంగా నడిరోడ్డుపై జనాన్ని అడ్డగించి.. ఏకంగా ఉపన్యాసాలు దంచిన వైనం. సిపిఎం శ్రేణులు సమ్మె విజయవంతం చేయాలంటూ ఉపన్యాసాలు ఇస్తూ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పించారు. కార్మికులను సమ్మెలో భాగస్వాములు చేయడం కోసం కర్మాగారం ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించడం సర్వసాధారణం. అందుకు విరుద్ధంగా నవభారత్ నుంచి పాత కొత్తగూడెం వెళ్లే మార్గంలో పాల్వంచ, కొత్తగూడెం, పాత కొత్తగూడెం కూడలిలో మీటింగ్ పెట్టడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.