19-09-2025 12:28:14 AM
మునిపల్లి, సెప్టెంబర్ 18 :మునిపల్లి మండలం పెద్దచెల్మెడలో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మెన్ సుధాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గయ్య భూమి పూజ చేశారు. రూ.12 లక్షలతో భవనాన్ని నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ కుమార్, ఆర్‌అండ్బీ డీఈ రవీందర్, ఏఈ మనీష్, కార్యదర్శి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రభాకర్, అంగన్వాడి టీచర్ రేణుక రెడ్డి తదితరులు ఉన్నారు.