08-07-2025 01:33:55 AM
- రూ. 4 కోట్లతో బుగ్గ వాగు ప్రక్షాళనకు ముందడుగు వేసిన ప్రభుత్వం
- ఎమ్మెల్యే కోరం కృషితో నిధుల విడుదల
- ఇల్లెందు, జులై 7 (విజయక్రాంతి):ఇల్లందు పట్టణంలోని ప్రజలు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న బుగ్గ వాగు ప్రక్షాళన పను లు వేగవంతం అయ్యాయి. అభివృద్ధికి అసలైన అర్థం చెప్పినట్లుగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను ప్రాధాన్యంగా తీసుకొని ముందడుగు వేసింది. పట్టణాన్ని నీటి ముం పు, దుర్వాసన, మలినాల నుంచి విముక్తి కలిగించే దిశగా బుగ్గ వాగు శుద్ధి కార్యక్రమం ప్రారంభం గర్వకారణమని చెప్పొచ్చు.
వర్షా లు ప్రారంభం అయిన సందర్భంగా దిగువ ప్రాంతాలు జలమయం కాకుండా చూడాలని అధికారులకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశించడంతో రిటైనింగ్ గోడ కోసం తీసిన మట్టిని తొలగించే కార్యక్రమాన్ని దగ్గరుండి మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యంగా ఈ ప్రక్షాళన ప్రాజెక్టుకు నిధులు కేటాయించి, పట్టణ అభివృద్ధికి చొరవ చూపిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పెరిగిన వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని, బుగ్గ వాగు ప్రవాహాన్ని నిరాటంకంగా జరగగలిగే విధంగా శుభ్రపరిచే ఈ చర్య, పట్టణ ఆరోగ్య భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు ఒక గొప్ప ప్రారంభంగా నిలుస్తోంది.
పలువురు వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాగు శుభ్రత వల్ల తమకే కాకుండా, ముందు తరాల ఆరోగ్యానికి బం గారబాట అవుతుందన్నారు. వర్షాకాలంలో ముంపు సమస్యకు ఇది మంచి పరిష్కార మార్గం అవుతుందని చెప్పొచ్చు. పనుల పర్యవేక్షణ కార్యక్రమంలో నాలుగో వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఆజాం, 18 వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు నరేంద్రుల అనుబాబు తదితరులు పాల్గొన్నారు.