05-05-2025 01:37:49 AM
సంగారెడ్డి, మే 4(విజయక్రాంతి) :జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్‌యూజీ-2025’ పరీక్ష ఆదివారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3,320మందిలో 3222 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 98 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలలో నీట్ పరీక్ష శాంతియుత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించబడిందని కలెక్టర్ క్రాంతి వల్లూరు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 487 మంది అభ్యర్థులకు గాను 470 మంది హాజరయ్యారని, ఎటువంటి అవాంఛనీయ సంగటన జరగకుండా ప్రశాంతంగా పరీక్ష ముగిసిందనితెలిపారు.