calender_icon.png 10 September, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమ ప్రస్థానం తెలిపే పుస్తక పాటల సిడి ఆవిష్కరణ

09-09-2025 09:45:24 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు జిల్లా కార్యదర్శి స్వర్గీయ సూర్యమన్న విప్లవ ప్రస్తానాన్ని వివరించే ఆగని వెలుగు సూర్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని పెన్షనర్ల భవనంలో సూర్యం సోదరుడు పదవి విరమణ పొందిన పీజీ హెడ్మాస్టర్ పరకంటి మురళీధర్ ఈ పుస్తకాన్ని రచించారు. పీడిత ప్రజల హక్కుల కోసం ప్రజలను చైతన్యం చేసి మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజా అవసరాలను తీరుస్తూ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేసిన మాజీ మావోయిస్టు ఉద్యమ నేత జిల్లా కార్యదర్శి స్వర్గీయ పరకంటి పండరి అలియాస్ సూర్యం అన్న దళం పేరుతో ప్రజల్లో మార్పు తెచ్చిన విషయాన్ని ఉద్యమకారులు నెమరు వేసుకున్నారు.

ఈ పుస్తక ఆవిష్కరణకు ప్రజా విప్లవకారులు వేణుగోపాల్ పాని పద్మ మాజీ ఎంపీ సోయం బాబురావు పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లొంగిపోయిన ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని అప్పటి నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి ఉద్యమకారులు జ్యోతి అక్క అజయ్ నాగరాజు లింగక్క తదితరులు ఉన్నారు