calender_icon.png 10 September, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ స్పీడ్..

09-09-2025 09:56:49 PM

ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పై జలసౌధ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్ట్ లు అన్ని స్పీడప్ అవుతున్నాయని, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి మన జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడం మనకు సానుకూలంశం అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. సోమవారం హైదరాబాదులో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పై జలసౌధలో సమావేశంలో మాట్లాడారు. నేను 2005 లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి ఎస్ ఎల్ బి సి సొరంగానికి శ్రీకారం చుట్టాం మని తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ టన్నెల్ అన్నారు. ఎస్ ఎల్ బి సి పూర్తి అయితే కృష్ణాలో అలకేటెడ్ నీటిని గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో పదేళ్లు పక్కన పెట్టారని 2027 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి,ఇరిగేషన్ మంత్రి చెప్పడం సంతోషమన్నారు. 

సాగర్ బ్యాక్ వాటర్ చాలా విలువైనవని, వాటిని చివరి వరకు అందేలా లైనింగ్ కోసం టెండరింగ్ చేసినందుకు ఇరిగేషన్ మంత్రికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. నార్కట్ పల్లి మండలం జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఒకటని అందుకే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ చేపట్టాం. రిటైర్డ్ ఇంజనీర్లతో పలుమార్లు స్వయంగా చర్చించి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుకున్నామని పేర్కొన్నారు.రిజర్వాయర్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రారంభించుకున్నామని,ఉదయ సముద్రం డ్రింకింగ్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తూ బ్రాహ్మణ వెల్లెంల కు రెగ్యులర్ గా వాటర్ పంపింగ్ చేయాలన్నారు.

రాష్ట్ర మంతా వర్షాలు పడ్డా..నల్గొండ జిల్లాలో కట్టంగూరు, మునుగోడు, నార్కట్ పల్లి లో వర్షాలు అతి తక్కువ పడ్డాయన్నారు.ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కు ప్రాబ్లం ఉందని పంటకు సాగునీటి కోసం చూస్తున్నారని రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. అధికారులకు ప్రతిసారి చెప్పాలా..? వాటర్ పంపింగ్ చేసి రిజర్వాయర్ ద్వారా సాగు నీరు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. అంతేగాక..అప్రోచ్ కెనాల్స్ పూర్తి చేసి దిగువన చెరువులు నింపాలనే ప్రయత్నం చేస్తున్నామనిఇప్పటికే కొత్త ఆయకట్టు సృష్టించామని చెప్పారు. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు వేసినఈ ప్రాజెక్ట్ కు ఇప్పటి వరకు రివైజ్డ్ టెండర్లు వేయలేదని,రైతులకు సాగునీరు అందించాలని పైపు లైన్ కోసం నా సొంతంగా 30లక్షలు ఖర్చు చేశానని తెలిపారు.300 కోట్లు బ్రహ్మణ వెల్లెంల కోసం కేటాయించాలని,10 శాతం నిధులు  సుమారు 3వేల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అవుతాయని అన్నారు.