calender_icon.png 10 September, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపూర్ణ ఆరోగ్యం సమకూరాలంటే యోగా యే ముఖ్య సాధన

09-09-2025 09:43:54 PM

భద్రాచలం యోగ ఆరోగ్య మిషన్ యోగ గురువు నరేష్ గురూజీ..

భద్రాచలం (విజయక్రాంతి): వయసుతో సంబంధం లేకుండా అందరూ సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే యోగాసనాలు, మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుందని భద్రాచలం యోగ ఆరోగ్యం మిషన్ యోగా గురువు నరేష్ గురూజీ(Naresh Guruji) తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని కమ్మ సత్రం ఆడిటోరియంలో ఆగస్టు 11 తేదీ నుండి సెప్టెంబర్ 9 తేదీ వరకు పెద్ద ఎత్తున యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో భద్రాచలం చెందిన ప్రముఖులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నరేష్ గురూజీ మాట్లాడుతూ యోగా ద్వారా పలు సమస్యలను పరిష్కరించుకోవడమే కాకుండా మానసిక ప్రశాంతత పొందుతారని తెలిపారు.

యోగాకు వయసుతో సంబంధం లేదని అందరూ పాల్గొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు కావాలని కోరారు. యోగా చేసేవారి కోసం కమ్మ సత్రం చైర్మన్ అడుసుమిల్లి జగదీష్, సభ్యులు బి. రామారావు,ఎం.  వీరయ్య , చావా లక్ష్మీనారాయణ పి. సత్యనారాయణలు ఎంతో ఉదారతతో ఆశ్రయం కల్పించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. అనంతరం కమ్మ సత్రం నాయకులు  పి సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, వీరయ్య తో పాటు పలువురు యోగా అభ్యాసకులు పాల్గొని యోగా ద్వారా తాము పొందిన అనుభూతిని వివరించారు. అనంతరం కమ్మ సత్రం చైర్మన్ అడుసు మిల్లు జగదీష్ ను, యోగా గురువు నరేష్ గురూజీని, యోగా నిర్వహకులు రాజా కే వెంకటేశ్వరరావు ( కె వి )లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.