calender_icon.png 19 November, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశసంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేసిన మోదీ

19-11-2025 12:00:00 AM

  1. వందేళ్లుగా ప్రజల కోసం పోరాటం చేస్తున్న సీపీఐ 

సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

హుజురాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : దేశ సంపదను కార్పొరేట్లకు ధారాధత్వం చేసిన ఘనత భారత ప్రధాని మోడీకి దక్కుతదని సిపిఐ జాతీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ వందేళ్ళ ప్రజా ఉద్యమాల చరిత్ర, అనేకమంది త్యాగజనుల, పోరాట యోధు ల త్యాగాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తెలియజేసేందుకు. 

ఈ జాత నవంబర్ 15న కొమరం భీమ్ జిల్లా జోడేఘాట్ నుండి ప్రారంభమై మంగళవారం హుజరాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ బస్సు జాతకు హుజురాబాద్ మండల కార్యదర్శి గోవిందుల రవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ. బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని, స్వతంత్ర పోరాటంలో ఏ పార్టీ కూడా పాల్గొనలేదని సిపిఐ పార్టీ మాత్ర మే ఉందని తెలిపారు.

100 సంవత్సరాల నుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని గుర్తు చేశారు. సుమారు భారతదేశంలో 6 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారని, భారత ప్రధాని మోడీ ఏం చేస్తున్నాడని అన్నారు నల్లధనాన్ని పేద ప్రజలకు పంచుతానాన్ని మాయమాటలు చెప్పిన మోడీ బాల కార్మికుల కోసం ఎలాంటి చట్టం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ దేశంలో రాజకీయ పార్టీల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదన్నారు. కమ్యూనిస్టులు రెండుగా చీలిపోవడంతో బలహీన పడ్డామని అందరం కలిసికట్టుగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు.

మావోయిస్టులు చర్చలకు సిద్ధమని తెలిపినప్పటికీ, కూబింగ్ నిర్వహిస్తూ ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ రావు, శంకర్, ఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రామారపు వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.