19-11-2025 12:00:00 AM
కరీంనగర్, నవంబరు 18 (విజయక్రాం తి) : రైతులు పండించిన పత్తి మొత్తాన్ని సీసీఐ ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లులకు ఎల్-1, ఎల్-2, ఎల్-3 అని సీసీఐ కేటా యించి ఒక మిల్లుకు 1450 క్వింటాళ్ల కొనుగోలు తర్వాతనే ఇంకొక మిల్లుకు అవకాశం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నిబంధన వలన రైతులు ఒకే మిల్లుకు వెళ్తుంటే మిల్లు యజమానులు కొర్రీలు పెట్టి రైతులకు నష్టం చేస్తున్నారని అన్నారు.
వెంటనే ఈ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఒక ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల పత్తి పండుతుం దని, కేవలం ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి కొనడానికి పరిమితి విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు హరిశంకర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మ న్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.