19-11-2025 12:00:00 AM
నిర్మల్, నవంబర్ ౧8 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దాన్యం కొనుగోలలో అక్రమాలు జరగకుండా కొనుగోల ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. వానాకాలం సీజన్లో నిర్మల్ జిల్లాలో 1,25,000 ఎకరా ల్లో రైతులు వరి ధాన్యం పండించారు. నిర్మ ల్ జిల్లాలో ఈ సీజన్లో 1,69,256 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం నిర్మల్ జిల్లాలో 343 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికీ వరి పంట చేతికొచ్చిన ప్రాంతాల్లో 317 కేంద్రాలను ప్రారంభించా రు.
డిఆర్‌డిఓ ఆధ్వర్యం లో 159, పిఎసిఎస్ ఆధ్వర్యంలో 129 డిసి ఎం ఎస్ ఆధ్వర్యంలో 21, గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 8 కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం వారికి మద్దతు ధరను క్వింటాలకు రూ.2385 మద్దతు ధర ప్రకటించగా, సన్నరకం ధాన్యంకు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వనున్నారు. జిల్లాలో ఇప్పటికే కుంటాల లోకేశ్వరం సోన్ దిల్వార్పూర్ నర్సాపూర్ సారంగాపూర్ మామిడి కడెం ఖానాపూర్ దస్తురాబాద్ మండలాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పదివేల మెట్రిట్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు పూర్తిచేసి అందులో 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్ గోదాములకు తరలించారు.
పారదర్శకంగా కొనుగోలు
నిర్మల్ జిల్లాలో వరి కోతలు ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు రైతులు వరి ధాన్యాన్ని తీసుకురావ డంతో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ కొనుగోల ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. వరి ధాన్యంలో తీమశాతం 17 ఉన్న పంటను తీసుకురచ్చేలా రైతులను చైతన్యం చేస్తున్నారు పంట తెచ్చిన 24 గంటల్లోని కొనుగోలు పూర్తి చేసిన అధికారులు ఆ ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లర్లకు తరలిస్తున్నారు రైతులు తరలించిన దాన్యం ట్రక్ సీట్లను ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేసి దాన్యం డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కౌంటర్లు గోని సంచులు ట్రాన్స్పో ర్ట్ కు అవసరమయ్యే లారీలు వెంటవెంటనే సమకూర్చుతున్నారు. తూకంలో కట్టింగ్ లేకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ మార్నింగ్ చేస్తు న్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి కొనుగోలు కేంద్రంలో కొనుగోలు నిబంధనలు మద్దతు ధర తూకం వేస్తే బ్యాగు వివ రాలు నమోదు చేస్తున్నారు.
రెవెన్యూ కలెక్టర్ కిషోర్ కుమార్ డీఎస్‌ఓ రాజేందర్ పౌర సరఫరాల శాఖ డిఎం సుధాకర్ ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు ప్రక్రియ వేగంగా పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎంఆర్ పెండింగ్ రైస్ మిల్లులపై ఆంక్షలు
నిర్మల్ జిల్లాలో దాన్యం కొనుగోళ్ల ప్రక్రి య వేగవంతంగా పూర్తి చేస్తున్న అధికారు లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులో పంపించేలా లారీలను అందుబాటులో ఉంచి బీహార్ కూలీల సాయంతో తరలింపు ప్రక్రియను చేపడుతున్నారు జిల్లాలో మొత్తం 107 రైస్ మిల్లర్లు ఉండగా ఇందులో 54 రైస్ మిల్లులు సిఎంఆర్ బియ్యం పెండింగ్ ఉండడంతో ఈసారి ఆ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించక కరీంనగర్ జగిత్యాల నిజాంబాద్ జిల్లాలకు దాన్ని అన్ని తరలింపు చేస్తున్నారు.
సిఎంఆర్ బియ్యం జాప్యం నేపథ్యంలో ఈసారి ప్రభు త్వం బ్యాంకు గ్యారంటీ ఉంటేనే రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు కేటాయించ డంతో వరి ధాన్యం తరలింపులో ఇలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు ప్రతిరోజు కలెక్టర్ అధికారులు దీనిపై సమీక్ష నిర్వహించి నోటుపాట్లను తెలుసుకొని చర్యలు చేపట్టడంతో కొనుగోల ప్రక్రి య సాఫీగా సాగుతుంది.
వెంటనే గోదాములకు తరలింపు
నిర్మల్ జిల్లా లో దాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఒకవైపు వేగంగా నిర్వహిస్తూనే మరోవైపు కొనుగోలు చేసినదాన్ని రైస్ మిల్లర్లకు తరలింపు పక్కనే వేగంగా చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎంఆర్ పెండింగ్ ఉన్న రైస్ మిల్లర్లకు ఈసారి ధాన్యం కేటాయింపులు ఇవ్వకుండా నిజామాబాద్ కరీం నగర్ జగిత్యాల జిల్లాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. రైతులకు అవసరమయ్యే గోని సంచులు కూడా సిద్ధంగా ఉన్నా యి మొన్నటి వరకు బీహార్ ఎన్నికల కారణంగా కూలీలు రాకపోవడంతో కొంత ఇబ్బందిగా కూలీలు రావడంతో ఇబ్బంది పూర్తిగా పోయింది.
సుధాకర్, సివిల్ సప్లై డిఎం నిర్మల్
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
నిర్మల్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా చేపడుతున్నాం జిల్లాలో మొత్తం 317 కేం ద్రాలను ఏర్పాటు చేసి 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయిం చుకున్నాంకొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమయ్యే గోలు సంచులు ఎలక్ట్రానిక్ కాంటాలు క్లీనింగ్ మిషన్లు ఏర్పాటు చేసి నాణ్యమైన ధాన్యమును మాత్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు అక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటాం.
కిషోర్ కుమార్, జిల్లా అడిషనల్ కలెక్టర్
రైతులకు ఇబ్బందులు లేవు
ఈసారి ప్రభు త్వం నిర్మించే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు. భీమశాతం 17 ఉంటేనే కొనుగోలు చేయడం వల్ల పంటను ఆరబెట్టి విక్రయిస్తున్నాం కూలీలు గోనసంచలకోట లేదు గతంలో ధాన్యం తూకం వేసిన తరలించేందుకు ఇబ్బంది పడే వాళ్ళ ఇప్పుడు వెంట వెంటనే ధాన్యాన్ని తరలించడం వల్ల ఎలాంటి కష్టాలు లేవు.
కూస మల్లేష్, రైతు