10-08-2024 01:27:06 PM
రాంచీ: తన పుట్టిన రోజు సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన సందర్భంలో తన చేతిపై వేసిన ముద్రను సోరెన్ ఎక్స్ లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లకు ఇది ప్రతీక అని వ్యాఖ్యానించారు. ప్రజలచే ఎన్నికైన ముఖ్యమంత్రిని 150 రోజులు ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి ఫిర్యాదు లేకుండా, ఎలాంటి నేరం లేకుండా జైలులో పెట్టగలిగినప్పుడు, సాధారణ గిరిజనులు/దళితుల/దోపిడీకి గురవుతున్న వారి పరిస్థితి ఏంటీ..? జార్ఖండ్ సీఎం ప్రశ్నించారు. దోపిడీకి గురైన, అణగారిన, దళిత, వెనుకబడిన, గిరిజన, ఆదివాసీలకు తాను అండగా ఉంటానన్నారు. చట్టం అందరికీ సమానం, అధికార దుర్వినియోగం లేని సమాజాన్ని మనం ఏకం చేసి నిర్మించాలని హేమంత్ సోరెన్ పిలుపునిచ్చారు.