calender_icon.png 18 July, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

10-08-2024 01:02:16 PM

హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. కాలిఫోర్నియాలోని గూగుల్ క్లౌడ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, టెక్, ఏఐ, స్కిల్లింగ్ గురించి ప్రతినిధులను కలిసి, తెలంగాణ రాష్ట్రం పురోగతికి అవి ఎలా ఉపయోగపడతాయి అనే అంశంపై చర్చించారు. ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్ ప్రతినిధులతో సీఎం సమావేశం అయ్యారు. హైదరాబాద్ లో కేపబులిటీ సెంటర్ ను విస్తరించాలని జొయిటిస్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలను  జొయిటిస్ ప్రారంభించనుంది.