calender_icon.png 27 August, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరాదిని ముంచిన భారీ వర్షాలు

27-08-2025 01:44:08 AM

  1. జమ్ముకశ్మీర్‌లో తొమ్మిది మంది మృతి
  2. ఛత్తీస్‌గఢ్‌లో వరదల్లో నలుగురు మరణం
  3. రాజస్థాన్‌లో వరదలు
  4. ఒడిషాలో నీట మునిగిన 160 గ్రామాలు ఇతర రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఉత్తర భారతాన వర్షాలు దంచికొడుతున్నాయి. ము ఖ్యంగా జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లో భారీ వ ర్షాలు కురుస్తున్నాయి. దీం తో జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా మొత్తం 13 మం ది  మృత్యువాత పడ్డారు. జ మ్ములో తొమ్మిది మంది, ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు చనిపోయారు. ఒడిషాలో దాదా పు 160 కి పైగా గ్రామాలు నీట మునిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో నిమనాలీలో తీవ్రమైన వరదలు సంభవించాయి. అరు ణాచల్ ప్రదేశ్‌లో కొం డచరియలు విరిగిపడ్డాయి.

ఢిల్లీ, పంజా బ్, హర్యానాలలో భా రీ వర్షాలు కురిశాయి. జమ్ముకశ్మీర్‌లో వరుసగా మూడో రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దోడా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు రావడంతో తొమ్మిది మంది మృతి చెందారు. అనేకమంది గాయప డ్డారు. భారీ వర్షాల కారణంగా దోడా జిల్లాలోని వైష్ణోదేవి గుడికి వెళ్లే మార్గంలో అధ్కవారీ ఇంద్రప్రస్థ భోజనశాల సమీపంలో కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. శిథిలాలు మీద పడడంతో కనీసం ఐదుగురు చనిపోయా రు. దాదాపు 14 మం ది గాయపడ్డారు. ఇక్కడ ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్లు ఆలయ బోర్డు తెలిపింది.

అలాగే ఇదే జిల్లాలో భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు ఆకస్మిక వరదల కారణంగా కొట్టుకుపోయి చనిపోయారు. కొండచరియలు విరిగిపడడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీంతో యాత్రను నిలిపివేశారు. కొండచరియలు విరిగి పడిన ప్రాంతాల్లో సహా యక చర్యలు కొనసాగుతున్నాయి. కథు వా, కిశ్త్‌వాడ్, రాజౌరీ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రవాహానికి అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. రావి నది ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి.

27 వరకు క్లౌడ్ బరస్ట్‌లు

 జమ్ము ప్రాంతంలోని కథువా, సాం డా, దోడా, రాంబన్, కిశ్త్‌వాడ్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అ వకాశం ఉండడంతో ఆ జిల్లాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వా తావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 27 వరకు జమ్ము ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కశ్మీర్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆగస్టు 27 వరకు విద్యాసంస్థల కు సెలవులు ప్రకటించారు. రావి, తావి, చీనాబ్ నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. 

సింథాన్ టాప్ కనుమ మూసివేత

భారీ వర్షాల కారణంగా కశ్మీర్‌లోయ ను కిశ్త్‌వాడ్ జిల్లాతో కలిపూ సింథాన్ టాప్ కనుమను,  జోజిలా కనుమలో భారీ హిమపాతం కురుస్తుండడంతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. రాంబన్ జిల్లా లోని చందర్‌కోట్, కేలామోర్, బ్యాటరా చెప్మా వద్ద కొండచరియలు విరిగపడడంతో జమ్ము-శ్రీనగర్ నేషనల్ హైవేపై రాకపోకలను నిలిపివేశారు. కిశ్త్‌వాడ్. దోడా, రాజౌరీ జిల్లాలో కొన్ని ప్రాంతా ల్లో  వరదలకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. దోడా, కిశ్త్‌వాడ్‌లన కలిపే ఎన్‌హెచ్-2 44పై రవాణా స్తంభించిపోయింది.

ఉధంపూర్, ఖాజీగండ్ వద్ద కూడా  వా హనాలు నిలిచిపోయాయి. కథువాలోని సహార్ ఖాద్ నదిపై ఉన్న వంతెన దెబ్బతినడంతో జమ్ము హైవేపై రవాణాకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను రద్దు చేశారు. కత్రా నుంచి బయలుదేరే దాదాపు 10 రైళ్లు రద్దయ్యాయి. మొధోపూర్ బ్యారేజ్  లక్ష క్యూసెక్కుల నీ టిని దాటిపోయింది. ఉధంపూర్‌లో తా వి నది 20 అడుగుల ప్రమాదస్థాయి ని దాటి ప్రవహిస్తోంది. చీనాబ్ నది 899. 3 మీటర్లకు చేరింది. వరద పరిస్థితిపై ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

ఛతీస్‌గఢ్‌లో వరదల్లో కొట్టుకుపోయిన నలుగురు..

ఛత్తీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాల్లో వరదల్లో కొట్టుకుపోయి నలుగురు మృ తి చెందారు. స్థానికులు, అధికారులు తెలిపిన ప్రకారం.. ఒకే కుటుంబానికి చెం దిన 40 మంది బస్సులో స్థానికంగా ఉ న్న మర్హిమాత ఆలయానికి దైవదర్శనానికి వచ్చారు. అనంతరం తిరిగి వెళు తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో వారు వాగును నడుచుకుంటూ దాటే ప్రయత్నం చేస్తుండగా ఆ కుటుంబంలో ని ఆరుగురు కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారంతో అధికారులు రంగం లోకి దిగి గాలింపు చర్యలను చేపట్టగా నలుగురి మృతదేహాలు లభ్యమయ్యా యి. చనిపోయిన వారిలో ముగ్గురు చి న్నారులు, ఓ వ్యక్తి ఉన్నారు. ఇద్దరిని రక్షించారు. సహాయక చర్యలు కొనసా గుతున్నాయి.