22-01-2026 12:41:41 AM
పంపిణీ చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
భద్రాచలం, జనవరి 21 (విజయక్రాంతి): భద్రాచలం నియోజకవర్గంలో అనారోగ్యంతో ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేసుకున్న వారికి చెక్కులు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో రావడం జరిగింది. వచ్చిన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు బుధవారం చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.