calender_icon.png 22 January, 2026 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకే గృహజ్యోతి ఇవ్వండి

22-01-2026 03:37:24 AM

సీఎంను కోరని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం అర్హులైన పేదలకే అందేలా చూడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆ యన లేఖ రాశారు. ‘2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు తగినంత విద్యుత్తు ఉత్పత్తి లేదు. అప్పటి ప్రభుత్వం విద్యుత్తు రంగంలో స్వావలంబనకై కొత్తగా భద్రాద్రి, యాదాద్రి, కొత్త గూడెం స్టేజ్ 6 వంటి ప్రాజెక్టులు చేపట్టింది. కానీ ఈ ప్రాజెక్టులు పూర్తికాలేదు. విద్యుత్తు కొరత తీర్చుటకు పొరుగు రాష్ట్రాల నుంచి అధిక ధరలకు కరెంటు కొనుగోలు చేసి రాష్ట్రం విద్యుత్తులో స్వావలంబన సాధించింది అన్న అపోహ కలిగించారు.

రాష్ట్రంలో సుమారు 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత కరెంటు ఇవ్వడంతో రైతులు కేవలం వరి పండించుటకే మొగ్గు చూపారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా ఉంది. వ్యవసాయ పంపుసెట్ల ద్వార అధికంగా భూగర్భజలాలు వాడడంతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నా యి. ఒక రైతుకు రెండు పంపుసెట్లకు మాత్రమే ఉచిత కరెంటు ఇచ్చినా బాగుండేది. అధిక ధరలతో విద్యుత్తు కొని వ్యవసాయరంగానికి ఉచితంగా కరెంటు ఇవ్వడంతో విద్యుత్తు పంపిణీ (డిస్కమ్లు) పీకల్లోతు అప్పులలో ఉన్నాయి. ఇది చాలదన్నట్లు ఈ మధ్య ప్రభుత్వం గృ హజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లలోపు కరెంటు వాడే వారికి ఉచితంగా కరెం టు ఇస్తున్నారు.

ఈ స్కీమ్‌లో చాలామంది అనర్హులు ఉన్నారు. 40 లక్షల కుటుంబాలకు ఇచ్చే ఉచిత కరెంటుతో ప్రభుత్వంపై సాలీన రూ.5,500 కోట్ల భారం పడుతుంది. ఉచితాల ద్వార వచ్చే డబ్బును ప్రజలు మద్యం కొరకు వెచ్చిస్తున్నారు. తెలంగాణలో చాలామంది యువత పనిచేయకపో వడంతో వ్యవసాయ, పరిశ్రమలలో చాలామంది పొరుగు రాష్ట్రాల వారు పనిచేస్తున్నా రు.  ఉచితాల వలన రాజకీయ లబ్ధి కలుగ వ చ్చునేమో కాని ఆర్థికంగా ఏవిధంగాను సమర్థయం కాదు. గృహజ్యోతి కార్యక్రమం కింద ఉచితంగా 200 యూనిట్ల కరెంటును పునః పరిశీలించి కేవలం పేదవారికి మాత్రమే ఈ కార్యక్రమం వర్తింపచేయాలి’ అని కోరారు.