calender_icon.png 22 January, 2026 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాలాగూడలో దోపిడీ దొంగల బీభత్సం

22-01-2026 03:40:56 AM

వృద్ధురాలి నుంచి బంగారు గొలుసు, గాజులు లాక్కెళ్లిన దుండగులు

సికింద్రాబాద్ జనవరి21 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ లోని లాలాగూడ ప్రాంతంలో దోపిడీ దొంగలు బీభత్సం సృ ష్టించారు. అడ్డగుట్ట పరిధిలోని హరిహంత్ సదన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఓ వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతిలోని బంగారు గాజులను లాక్కెళ్లి పరారయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.అపార్ట్ మెంట్స్ లోని 301వ ఫ్లాట్లో నివాసం ఉంటున్న బాల రుక్మిణి (80) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి ప్రాంగణంలోకి వచ్చారు. ఇంటి బయట పనుల నిమిత్తం ఉన్న వృద్ధురాలిని గమనించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అకస్మాత్తుగా ఆమెపై దాడి చేశారు.

ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన వృద్ధురాలు ప్రతిఘటించేలోపే, ఆమె మెడలోని గొలుసుతో పాటు గాజులను లాక్కొని దుండగు లు వేగంగా అక్కడి నుంచి తప్పించుకున్నా రు. ఘటనపై సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరిస రాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ దుం డగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం సుమారు 9 తులాల బంగారం అపహరించినట్లు సమాచారం.

ఈ ఘటన జరిగిన సమ యంలో బాధితురాలి కుమారుడు ఉదయం 8.30 గంటలకే ఎస్బీఐ కోటి శాఖకు వెళ్లినట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు క్యాప్ ధరించి ఉన్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. లాలగూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.నగరంలో వరుసగా ఇలాంటి ఘటన లు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా అపార్ట్మెం ట్లు, నివాస ప్రాంతాల్లో పోలీస్ గస్తీ పెంచాలని,భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.