23-09-2025 12:45:50 AM
నారాయణపేట, సెప్టెంబర్ 22(విజయక్రాంతి) : జిల్లాలో క్రాప్ బుకింగ్ ను వంద శాతం పూర్తి చేసి, పత్తి కొనుగోళ్లకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూ చించారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి కేం ద్రంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ,మార్కెటింగ్, హార్టికల్చర్ శాఖల అధికారుల సమా వేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఈ సారి పత్తి కొనుగోళ్ల కు సంబంధించి సీ సీ ఐ తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్ గురించి జిల్లా రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ ఏ ఈ వో లదే అన్నారామె. కొత్త యాప్ విధానాన్ని అమలు చేయడం ద్వారా మిల్లుల వద్ద పత్తి రైతులు నిరీక్షించే పరిస్థితి ఉండదని కలెక్టర్ తెలిపారు.
గతంలో మిల్లర్లు ఎల్ 1, ఎల్ 2 ప్రకారం పత్తిని కొనుగోలు చేసే వార ని, ఈ సారి ఆ విధానాన్ని రద్దు చేసి అన్ని మిల్లుల లో పత్తి కొనుగోలు చేస్తే రైతులకు ఇబ్బందులు ఉండవని కలెక్టర్ చెప్పారు. ఈ సారి కౌలు రైతులు కూడా విక్రయించే అవకాశం ఉంటుందన్నారు. అయితే కపాస్ కిసా న్ యాప్ లో రైతులు స్లాట్ బుక్ చేసుకుంటే వారం రోజుల లోపు ఎప్పుడైనా పత్తిని మి ల్లులకు తీసుకెళ్ళి విక్రయించుకోవచ్చని ఆమె తెలిపారు.
జిల్లాలో గతేడాది పత్తి సాగు, ఈ సారి సాగు వివరాలు, అలాగే వరిసాగు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నా రు. ఆయిల్ ఫాం సాగు పై విసృత ప్రచారం అవసరం జిల్లాలో ఆయిల్ ఫాం సాగు గు రించి రైతులకు అవగాహన కల్పించి ఆయిల్ ఫాం సాగువిస్తీర్ణం పెంచేలా వ్యవసాయ, హార్టికల్చర్ శాఖ అధికారులు సమన్వయం తో ముందుకు వెళ్ళాలని కలెక్టర్ ఆదేశించా రు.
ఆయిల్ ఫాం సాగును పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభు త్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని, ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారిం చాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సున్నితంగా హెచ్చరించారు. జిల్లాలో ఆయిల్ ఫాం సాగు జరుగుతున్న మక్తల్, మరికల్, మాగనూరు మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో ఆయిల్ ఫాం సాగు విస్తీర్ణం వివరాలను కలెక్టర్ అడి గి తెలుసుకున్నారు.
సమావేశంలో జిల్లా వ్య వసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ వరి, పత్తి సాగు, దిగుబడి, కపాస్ కిసాన్ యాప్, క్రాప్ బుకింగ్ గురించి క్లుప్తంగా వివరించా రు. డీఎస్పీ నల్లపు లింగయ్య పత్తి కొనుగోళ్ల విషయంలో గతేదాది జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్ర తా చర్యలు తీసుకునేలా సంబంధిత ఎస్. ఐ లకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో నారాయణపేట మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, సీపీ వో యోగానంద్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని బాలమణి, ఆర్టీ వో మేఘా గాంధీ, డీ ఎస్ వో బాల్ రాజ్, సీసీఐ స్టేట్ జనరల్ మేనేజర్ ప్రజక్తా, సీసీఐ అధికారులు, జిల్లాలోని అన్ని మండలాల ఏవోలు, ఏఈవో లుపాల్గొన్నారు.