18-08-2025 12:16:24 AM
రాష్ర్ట సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి
జహీరాబాద్, ఆగస్టు 17 : ముఖ్యమంత్రి సహాయనిధి బీద ప్రజలకు వరంలాంటిదని తెలంగాణ రాష్ర్ట సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జహీరాబాద్లో సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకులు డాక్టర్ సిద్ధం ఉజ్వల్ రెడ్డితో కలిసి 17 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఆదుకునేందుకు రాష్ర్ట ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు అందించడం వల్ల వారికి ఎంతో కొంత ఆర్థిక బలాన్నిస్తుందని ఆయన తెలిపారు.
ఈ సహాయనిధి చెక్కుల మంజూరుకు కృషి చేసిన రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రాష్ర్ట నాయకులు డాక్టర్ సిద్ధం రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, సిడిసి చైర్మన్ ముబీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ ఎంపిటిసి గుండారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుభాష్, మల్లికార్జున్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు;పాల్గొన్నారు.