18-08-2025 12:15:14 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు
మణుగూరు, ఆగస్టు 17 (విజయ క్రాంతి) : కామ్రేడ్ బొల్లోజు అయోధ్య చారి మరణం వామ పక్షాలకు సీపీఐకే కాకుండా ప్రజాస్వా మ్య వాదులం దరికీ తీరనిలోటని, సిపిఐ రా ష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశి వ రావు అన్నారు. ఆదివారం స్థానిక కిన్నెర కల్యాణమండపంలో అయోధ్య సంతాపసభ ను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆ యన చిత్రపటానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు, వ్యాపార, పట్టణ ప్రముఖు లు, ప్రజలు పూల మాలలేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించా రు.
సంతాప సభలో కూనంనేని మాట్లాడు తూ ఈ ప్రాంతం లో ప్రజలకు, బొగ్గుగని కా ర్మిక వర్గానికి, రైతాంగానికి, అన్ని వర్గాల సమస్యలపై అయోధ్య ఎనలేని పోరాటాలు, అనేక ఉద్యమాలు చేశారని, యువకుడిగా క మ్యూనిస్టు ఉద్యమాల వైపు ఆకర్షించబడి ప్రజలహక్కుల , పరిరక్షణ కోసం ఆనాటి భూ స్వాములపై తిరుగుబాటు జెడా ఎగురవేశారని గుర్తు చేశారు పలు నిర్బంధాల ను, కేసులను ఎదుర్కొన్నారని, ఎన్నో పోరాటాలకు పురుడు పోసారని,
అందుకే ఆయ నంటే ప్రజలకుఎనలేని అభిమానమని, ఈయన స్ఫూర్తితోనే ఎంతో మంది ప్రజలు, కార్మికులు ఉద్యమ బాట నడిచారని, ఆయ న చేసిన సేవలకు కొలమానం లేదని, నిబద్ధత, నిజాయితీ గల వారి ఆశయ సాధన కు మనమంతా కంకణ బద్దులం కావాలని పార్టీ కార్యకర్తలను కోరారు.
కన్నీటి పర్యంత మైన ఎమ్మెల్యే
అయోధ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కన్నీటిపర్యంత మయ్యారు. సిపిఐ నుండి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, ఆ యన ను ఎప్పటికీ మరిచిపోలేనని, తన రాజకీయ గురువు ఆయనేనన్నారు. ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడ్డ నిజమైన కమ్యూనిస్టు ఆయనేనన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే షామీర్ బాషా,సిపిఐ నేత భాగం హేమంత రావు, డిసిసిబి డైరెక్టర్ తు ళ్లూరు బ్రహ్మయ్య, పాకలపాటి చందు, నెల్లూరి నాగేశ్వరరావు, సాంబ శివ రావు, సాధినేని. వెంకటేశ్వ రావు, రాంగోపాల్, ము నీర్, ఆర్. మధుసూదన్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.