calender_icon.png 23 May, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి కోర్టులో హాజరైన సీఎం రేవంత్

23-05-2025 12:35:27 AM

  1. గత ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించారంటూ ఫిర్యాదు
  2. జూన్ 12న తుదితీర్పు 

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదులో భాగంగా గురువారం తెలంగాణ ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. కాగా ముఖ్యమంత్రి హోదా లో ఆయన కోర్టు ముందు హాజరుకావడం ఇది రెండోసారి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లకు సంబంధించిన వ్యా ఖ్యలపై బేగంబజార్, నల్లగొండ, మెదక్ పో లీస్ స్టేషన్లలో కేసు నమోదైన కేసులో ఆయన గురువారం కో ర్టుకు హాజరయ్యారు.

కేసు నమోదైన సమయంలో రేవం త్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. తానెలాంటి తప్పు చేయలేదని, పోలీసులు కావా లని తనపై తప్పుడు కేసులు బనాయించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భం గా కోర్టుకు తెలియజేశారు. సీఎం స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన నాంపల్లి స్పెషల్ కోర్టు, జూన్ 12వ తేదీన తీర్పు ప్రకటించనుంది.