calender_icon.png 30 August, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయం అంటేనే.. అధికారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు

30-08-2025 04:31:33 PM

హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి రాజకీయల నుంచి జాతీయ రాజకీయలకు ఎదిగారని, తను నమ్మిన సిద్దాంతాలను సురవరం సుధాకర్ రెడ్డి చివరివరకు ఆచరించారని సీఎం రేవంత్ అన్నారు. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారని, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ఆనాడు సురవరం ప్రతాపరెడ్డి కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో గోల్కొండ పత్రిక ద్వారా ప్రజల్లో స్పూర్తినింపారని.. మొదటితరంలో సురవరం, బూర్గుల వంటివారు పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చారని అన్నారు.

రెండో తరంలో జైపాల్ రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి వంటివారు రాజకీయాల్లో రాణించారని,  జైపాల్ రెడ్డి దక్షిణ భారత్ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎన్నికైనా యంగెస్ట్ ఎంపీ అని తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి గుర్తింపు, ఆయన సిద్దాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తామని.. ప్రజలకు సురవరం ఎప్పుడూ గుర్తుండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. ప్రజల గౌరవం పొందిన వారి చిరునామాలు ప్రజల మధ్య నిరంతరం ఉండాలని, కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టామని తెలిపారు. హ్యాండ్లూమ్ ఇనిస్టిట్యూషన్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని, సెక్రటేరియట్ ముందు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని నిర్ణయించామని అన్నారు. రాజకీయం అంటేనే.. అధికారం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని, ఐదేళ్లు కూడా ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు కొందరు ఇష్టపడట్లేదని సీఎం పేర్కొన్నారు.