17-01-2026 03:06:27 AM
రాష్ట్ర యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి
మహబూబ్ నగర్, జనవరి 16 (విజయక్రాంతి): అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాష్ట్ర యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాల్గొనే సభా ప్రాంగణ ఏర్పాట్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తో కలిసి పర్యవేక్షించారు.
ఈ మట్టి బిడ్డ కు మన సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలుకుదామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో 1284.44 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అపూర్వ స్వాగతం పలకాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, బెక్కెరి మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు శాంతన్న యాదవ్, ఫయాజ్, తాహెర్, బాలస్వామి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.