calender_icon.png 17 January, 2026 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ కష్టం వచ్చింది బిడ్డా!

17-01-2026 03:04:43 AM

అలంపూర్, జనవరి 16: కొడుకుని చిన్నప్పటి నుంచి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది ఓ తల్లి...విద్యా బుద్ధులు నేర్పించింది.ఇక పెళ్లి చేసి ఓ ఇంటి వాడిని చేసి తన బాధ్యతను తీర్చుకుందామని భావించింది.కానీ అంతలోనే ఆ తల్లి ఆశలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి.కొడుకు ఆత్మహత్యతో ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది.ఈ విషాద ఘటన సంక్రాంతి పండుగ నాడు గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

ఎస్త్స్ర స్వాతి తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన బొంకూరు ఈశ్వరమ్మ, వెంకట్ రెడ్డి కు ఇద్దరు కుమారులు.గత కొన్నేళ్ల కిందట వెంకట్ రెడ్డి మృతి చెందగా ఇక ఆ కుటుంబ బాధ్యతలు మొత్తం తల్లి తీసుకుంది.అయితే చిన్న కుమారుడు వసంత్ కుమార్ రెడ్డి (33)అలియాస్ నాని ఇంటి వద్దే తల్లితో ఉంటూ మండల కేంద్రంలోని గ్రోమోర్ షాపులో వర్క్ చేస్తుండేవాడు.

మూడు నెలల క్రితం అదే మండల కేంద్రానికి చెందిన ఓ యువతీతో పెళ్లి నిశ్చయించారు.అట్టి వివాహం కార్యక్రమం గురువారం జరగాల్సి ఉండగ... అనివార్య కారణాలతో జరగక పోవడంతో వసంత్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.ఉదయం తన బెడ్ రూమ్ లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అయితే ఉదయం గుడికి వెళ్లిన యువకుని తల్లి ఈశ్వరమ్మ తిరిగి ఇంటికి వచ్చి చూడగా ..

కుమారుడు నోట్లో నురగలు వస్తూ ..అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించి వెంటనే అంబులెన్స్ లో అల్లంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.పరీక్షించిన డ్యూటీ డాక్టర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.అయితే అంగరంగ వైభవంగా పెళ్లి జరగవలసిన కొడుకు ....చితికి తరలి వెళ్లడంతో ఆ తల్లి తీవ్ర కన్నీటి పర్యంతమయింది.